వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైవాహికేతర సంబంధం: సిఐఎ చీఫ్ రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

David Petraeus
వాషింగ్టన్: వైవాహికేతర సంబంధంపై సిఐఎ డైరెక్టర్ డేవిడ్ పెట్రాయెస్ రాజీనామా చేశారు. తన ప్రవర్తన అంగీకారయోగ్యం కాదంటూ ఆయన రాజీనామా చేశారు. అత్యున్నత నిఘా సంస్థ చీఫ్ పెట్రాయెస్ తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు శుక్రవారం సమర్పించారు. వివాహమైన 37 ఏళ్ల తర్వాత తాను వైవాహికేతర సంబంధం పెట్టుకోవడమనేది సరి కాదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

ఒక భర్తగా, సంస్థ అధిపతిగా తన ప్రవర్తన సరైంది కాదని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పెట్రాయెస్ రాజీనామాను బరాక్ ఒబామా అంగీకరించి, పెట్రాయెస్ చేసిన సేవలను ప్రశంసించినట్లు తెలుస్తోంది. పెట్రాయెస్ వైవాహికేతర సంబంధం గురించి ఎఫ్‌బిఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పెట్రాయెస్ రాజీనామా నిఘా, రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

పెట్రాయెస్ బుధవారం 60వ పడిలో పడ్డాడు. శ్వేతసౌధంలో ఆయన గురువారం ఒబామాను కలిసి రాజీనామాను సమర్పించారు. శుక్రవారంనాడు రాజీనామా ఆమోదం పొందింది. పెట్రాయెస్ 38 ఏళ్ల క్రితం హోలీ పెట్రాయెస్‌ను పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్‌లోని వెస్టే పాయింట్ యుఎస్ మిలటిరీ అకాడమీ క్యాడెట్‌గా ఉన్నప్పుడు ఆయన ఆమెను కలిశారు. ఆమె అకాడమీ సూపరింటిండెంట్ కూతురు. వారికి ఇద్దరు పిల్లలు.

పెట్రాయెస్ సేవలను ఒబామా ప్రశంసించారు. దశాబ్దాల పాటు పెట్రాయెస్ అసాధారణమైన సేవలు అందించారని, అమెరికా రక్షణకు, పటిష్టతకు సేవలు అందించారని అన్నారు. సిఐఎ డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ మోరెల్ యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తారని చెప్పారు. సిఐఎ తన కృషిని కొనసాగించడంలో ముందుంటుందని ఆశిస్తున్నట్లు ఒబామా అన్నారు.

English summary
CIA Director David Petraeus on Friday resigned over an extra marital affair, saying his behavior was "unacceptable". The top intelligence official of the US submitted his resignation to US President Barack Obama during a meeting at the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X