• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హీనా, బిలావల్ లవ్ అఫైర్ స్టోరీ రాసిన ఎడిటర్ అరెస్టు

By Pratap
|
Hina Rabbani Khar-Bilawal Bhutto
ఢాకా: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పిపిపి చీఫ్ బిలావల్ భుట్టోకు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తాకథనం రాసిన బంగ్లాదేశీ సంపాదకుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆర్థిక మోసాల ఆరోపణలపై అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఢాకాకు చెందిన ఓ పత్రిక రాసింది.

కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక మోసాల ఆరోపణలపై రెండు రోజుల క్రితం సలాహుద్దీన్ షోయబ్ చౌదరిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు డిప్యూటీ కమిషనర్ మసుదుర్ రహ్మాన్ ఓ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు.

సజ్జాద్ హొస్సెన్ అనే వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు బ్లిట్జ్ ఆన్‌లైన్ వీక్లీ నడుపుతున్న చౌదరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణపై చౌదరి 2003లో అరెస్టయ్యాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్‌కు, హీనాకు మధ్య ప్రేమాయణంపై రెండు నెలల క్రితం రాసిన వార్తాకథనాలు తీవ్ర దుమారం రేపాయి.

ఢాకాకు హీనా రబ్బానీ ఖర్ రావడానికి ఒక రోజు ముందు చౌదరిని అరెస్టు చేశారు. హీనా రబ్బానీ ఖర్ శుక్రవారం ఢాకాకు వచ్చారు. ఆమె బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను, ప్రతిపక్ష బిఎన్‌పి చీఫ్ ఖలీదా జియాను కలిశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
The Bangladeshi editor who did the controversial story on a steaming love affair between PPP chief Bilawal Bhutto and Pakistan Foreign Minister Hina Rabbani Khar, has been jailed on charges of money embezzlement, report Dhaka-based dailies.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more