• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే ప్రమాదాలు: ముఖ్యమంత్రి వ్యాఖ్య

By Srinivas
|

Raman Singh
రాయపూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురి కావడానికి అమ్మాయిలతో స్నేహాలు కూడా ఓ కారణమని రమణ్ సింగ్ అన్నారు. రహదారి భద్రత గురించి మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు పెరగడానికి కారణం గర్ల్ ఫ్రెండ్స్, బైకులు, మొబైల్ ఫోన్‌లు కారణమన్నారు.

ఒక మంచి మోటార్ సైకిల్, కొత్త మొబైల్, ఒక స్నేహితురాలు ఉంటే చాలు... ప్రమాదాలు వాటంతట అవే జరుగుతున్నాయన్నారు. వేలాది రూపాయలు పెట్టి బైక్‌లు కొనేవారు ప్రాణాన్ని రక్షించేందుకు అవసరమైన హెల్మెట్‌లను మాత్రం వందల రూపాయలు పెట్టి కొనడానికి కూడా వెనుకాడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రమణ్ సింగ్ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ తీవ్రస్థాయిలో ఖండించింది.

కాగా ఇటీవల పలువురు రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్యను రూ.50 కోట్ల విలువైన గర్ల్ ఫ్రెండ్‌గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ఎంపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

English summary
Chhattisgarh Chief Minister Raman Singh on Saturday 
 
 stepped into controversy after saying that good-
 
 looking girls and mobile phones were primary reasons 
 
 for road accidents. "If you have a good motorcycle, 
 
 good mobile and a beautiful girlfriend, accidents are 
 
 bound to happen," he told media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X