వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: అమెరికా సిఐఏ చీఫ్ రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 CIA chief resigns over affair
వాషింగ్టన్: వివాహేతర సంబంధం విషయంలో అమెరికా గూడచార సంస్థ సిఐఏ డైరెక్టర్ జనరల్ డేవిట్ పెట్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. పెట్రాస్ రాజీనామా అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అరవై ఏళ్ల పెట్రాస్ శుక్రవారం రాత్రి అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. అధ్యక్షుడు దానిని ఆమోదించారు. మైఖేల్ మోరెల్‌ను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు.

అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది.. గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సిఐఏ). అయితే పెట్రాస్ ఒక మహిళా జర్నలిస్ట్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని పదవి పోగొట్టుకోవడం గమనార్హం. ఆయన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన పౌలా బ్రాడ్‌వెల్ అనే వివాహితతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో చివరికి అది పెట్రోస్ రాజీనామాకు దారితీసింది.

అమెరికాకే చెందిన మరో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బిఐ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. సిఐఏ సిబ్బందికి విడుదల చేసిన ఒక లేఖలో పెట్రాస్ తన వివాహేతర సంబంధం గురించి వెల్లడించారు. తాను 37 ఏళ్ల తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకొని తప్పు చేశానని, అలాంటి వ్యవహార శైలి, ఒక భర్త, ఒక సంస్థకు అధిపతిగా తనకు తగిన పని అని ఆ లేఖలో పేర్కొన్నారు.

English summary

 David H Petraeus, the director of the Central Intelligence Agency and one of America's most decorated four-star generals, resigned on Friday after an FBI investigation uncovered evidence that he had been involved in an extramarital affair with his biographer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X