హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

14ఏళ్ల వనవాసం పూర్తైంది: కిరణ్‌పై మళ్లీ అసదుద్దీన్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు. తమకు కాంగ్రెసు పార్టీతో 14 ఏళ్ల వనవాసం పూర్తయిందన్నారు. కాంగ్రెసు పార్టీ కొన్ని మత సంస్థలతో కలిపోయిందని ఆరోపించారు. నాడు ప్రధాని పివి నరసింహా రావు హయాంలో ముస్లింలు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కిరణ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో అసదుద్దీన్ దారుస్సలేంలో 13 ముస్లిం సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చర్యలతో పాతబస్తీ స్తంభించిందన్నారు. 25 తర్వాత తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించామో ప్రజలకు వివరిస్తామన్నారు. చార్మినార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆలయాన్ని సందర్శించడం మత విధానానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఒక్క ముస్లిం ఓటు కూడా పడదన్నారు. ఎంఐఎం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం జెఏసి ప్రకటించింది. ప్రభుత్వం మతరమైన సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. మతసామరస్యం కాపాడలేని ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు.

కాగా సిపి అనురాగ్ శర్మకు, హెచ్చార్సీకి మజ్లిస్ నేతలు ముస్లింల మనోభావాలు కాపాడాలంటూ వినతిపత్రం అందించారు. మజ్లిస్ ఫిర్యాదు స్వీకరించిన హెచ్చార్సీ 48 గంటల్లో పాతబస్తీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
Hyderabad MP Asaduddin Owaisi lashed out at Kiran Kumar Reddy government on Wednesday. He said they will announce their future plane after 25th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X