హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

21.48 మిలియన్ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rare Golconda Diamond
జెనీవా: అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాదులోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు (20.355 సివ్స్ ఫ్రాన్స్‌) పలికింది. జెనీవాలో జరిగిన వేలం పాటలో వజ్రం ఆ ధరను పలికింది. ఈ వేలం మంగళవారంనాడు జరిగింది. 19 ఏళ్ల క్రితం బిడ్డరు కొనుగోలు చేసిన ధరకు రెండింతల ధర ఈ వేలంలో పలికింది.

ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రానికి, వర్ణరహిత వజ్రం క్యారట్‌కు పలికే ధరల విషయంలో ఇదే రికార్డు. క్రిస్టీ అంతర్జాతీయ ఆభరణాల శాఖ డైరెక్టర్ ఫ్రాంకియోస్ కూరీల్ ఈ విషయం చెప్పారు. ఈ గోల్కొండ వజ్రం ఆస్టియాకు చెందిన అర్చుడుకే జోసెఫ్ ఆగస్టుకు చెందింది. అతను 1962లో మరణించాడు. ఈ వజ్రాన్ని 1933లో ఆస్ట్రియా రాకుమారుడు హంగేరీ జనరల్ క్రెడిట్ బ్యాంక్ వాల్ట్‌లో డిపాజిట్ చేశాడు.

మూడేళ్ల తర్వాత దాన్ని ఓ ఐరోపా బ్యాంకర్‌కు విక్రయించారు. అప్పటి నుంచి అది ఫ్రాన్స్‌లో సేఫ్ డిపాజిట్ బాక్సులో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అది ఎవరి కంటపడకపోవడం అదృష్టమని క్రిస్టీ అన్నారు. ఆ వజ్రాన్నిి 1961 ఒకసారి, 1993లో మరోసారి వేలం వేశారు. మళ్లీ ఇప్పుడు క్రిస్టీ దాన్ని వేలం వేశారు. ఈ వజ్రం భారీ స్ట్రా బెర్రీ సైజులో ఉంది.

మంగళవారంనాడు మొదటి బిడ్ 8 మిలియన్ల స్విస్ ఫ్రాన్స్‌లు పలికింది. కొద్దిసేపట్లోనే బిడ్ సొమ్ము పెరుగుతూ పోయింది. టెలిఫోన్ ద్వారా ఓ వ్యక్తి 20.355 స్విస్ ఫ్రాన్స్‌లకు ఓ వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నాడు. అతను తన పేరు వెల్లడించడానికి నిరాకరించాడు. కోహినూర్ వజ్రంతో పోల్చదగ్గ వజ్రం ఇది అని అమెరికా, స్విట్టర్లాండ్‌ల్లో క్రిస్టీ ఆభరణాల అధిపతి రాహుల్ కడాకియా అన్నారు.

English summary
A 76.02-carat colorless diamond that was mined from Golconda near Hyderabad fetched an amazing 20.355 million Swiss francs (21.48 million US dollars) at an auction here yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X