హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కోసం ఆ 3 సినిమాలు: 'ఫిలిమ్' ఇండస్ట్రీ సపోర్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీలో పలువురు ఉత్సుకత చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్న పలువురు 2014 ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైయస్‌తో పూరీకి ఉన్న అనుబంధమే ఇలా చేయించిందని అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పూరీ, ఆయన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని, జగన్ వారికి టిక్కెట్ పైన హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

దర్శకుడు కృష్ణవంశీ తదుపరి చిత్రం 'పైసా' వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్‌గా ఉండవచ్చునని అంటున్నారు. ఈ సినిమాలో జగన్‌ పాత్రధారిగా భావించే హీరోను రాజకీయ నేతగా అలాగే వ్యాపారవేత్తగా చూపిస్తారట. సినిమా క్లైమాక్స్‌లో అతను ముఖ్యమంత్రిగా అయినట్లు చూపిస్తారట.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా వస్తున్న అసెంబ్లీ రౌడీ కూడా జగన్‌ పాత్రను ఎలివేట్ చేయనుందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ చిత్రంలో జగన్‌ను అన్యాయంగా జైలుకు పంపించడం, ఆ తర్వాత అతను ప్రజా మద్దతుతో బయటకు రావడం, అసెంబ్లీలో అడుగుపెట్టడం చూపించనున్నారట.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో దివంగత వైయస్‌కు ఫేవర్‌గా, 'పైసా', 'అసెంబ్లీ రౌడీ' చిత్రాలు జగన్‌ను అనుకూలంగా ఉండటం వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ నేతల హస్తం ఉందా అనే చర్చ జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

ఇప్పటికే మోహన్ బాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లారని, కేవలం అధికారకంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందంటున్నారు. ఆయన వ్యవహార శైలి, తనయుడు మంచు విష్ణు తదుపరి సినిమా ఇవన్నీ చూస్తుంటే మోహన్ బాబు జగన్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

జగన్ కోసం ఆ మూడు: 'ఫిలిమ్' సపోర్ట్!

ఎపి నుండి యూపికి షిప్ట్ అయి మళ్లీ ఇటు వైపు దృష్టి సారిస్తున్న జయప్రద కూడా ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ వైపుకు వెళ్తుందా లేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రజలు చూపించిన పార్టీలోకి వెళ్తానంటూ ఆమె చేతులు దులుపుకున్నారు.

ఇప్పటికే జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ఉప ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడంతో అతను తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, సోదరి షర్మిలను రంగంలోకి దింపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట పేరుతో ప్రజల్లోకి వెళుతుంటే తాము ప్రజల్లో ఉండాలని భావించి షర్మిలచే మరో ప్రజా ప్రస్థానం ప్రారంభింప చేశారు.

జైలులో ఉన్న జగన్ తనను ములాకత్ సమయంలో కలిసేందుకు వస్తున్న పార్టీ నేతలతో కూడా నిత్యం ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారట. ఏఏ నియోజకవర్గంలో ఎవరెవరికి టిక్కెట్ ఇస్తామో వారికి చెప్పి ప్రజల్లోకి ఇప్పటి నుండే వెళ్లాలని సూచిస్తున్నారట. ఇలా ఓ వైపు రాజకీయంగా జగన్ అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతుండగా మరోవైపు సినీ పరిశ్రమలోని పలువురు కూడా జగన్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Cameraman Ganga Tho Rambabu was supposed to be a veiled promotion of the late YSR as and able leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X