వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షా45వేల కోట్లు ఎక్కడివి: చిదంబరం, మళ్లీ 2జి వేలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Govt plans another auction of 2G spectrum by March 31 |
న్యూఢిల్లీ: 2 జి స్పెక్ట్రం వేలం అంతా సక్రమంగానే జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం శుక్రవారం అన్నారు. 2జి స్పెక్ట్రంలో రూ.1.45వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ తెల్చిందని, అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని చిదంబరం ప్రశ్నించారు. అంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని కాగ్ చెప్పడం శోచనీయమన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మనీష్ తివారి అన్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపిఏ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2జి స్పెక్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, సంచలన వార్తలు వచ్చాయని, వాటి ప్రభావం ఇటీవల జరిగిన వేలంపై పడిందని ఆయన చెప్పారు.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే 2జి స్పెక్ర్టం వేలం జరిగిందని కపిల్ సిబాల్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా మరోసారి వేలం వేస్తామని ఆయన చెప్పారు. 2జి స్పెక్ట్రంపై సంచలన వార్తలు రావడంతో ఆ ప్రభావం పడిందన్నారు. ఇది దేశ టెలికం అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. అయినప్పటికీ భారత్ ప్రపంచ టెలికాం రంగానికి ధీటుగా ఎదిగేందుకు ఎంతో సమయం పట్టదన్నారు.

English summary
The government plans to put on auction the circles that went without bids in the just concluded sale of 2G mobile phone spectrum, by March 31, telecom minister Kapil Sibal said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X