వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడే దూరం కాను: రాజకీయ ఆరంగేట్రంపై నమిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Namitha
చెన్నై: తన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటి నమిత గురువారం స్పందించారు. తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు, భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయని అవి అవాస్తవమన్నారు. తాను పాలిటిక్స్‌లోకి రావడం లేదన్నారు. ప్రస్తుతం తాను పలు సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉన్నానని చెప్పారు. తాను ఇప్పుడే సినిమాలకు దూరం కానని చెప్పారు.

కాగా తన అందాలతో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచుకున్న నమిత సినిమాలకు ఓ నమస్కారం పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయ ఆరంగేట్రం చేయవచ్చునని అంటున్నారు. నమిత బిజెపిలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ రకంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించారనే వాదనలు వినిపించాయి.

సినిమాల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. సింహ లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో ఇటీవల ఆమె తమిళ టీవీ చానెళ్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ సభ్య త్వం తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వెలువడ్డాయి.

డీఎంకే, అన్నాడీఎంకేల తో జత కట్టనిదే ఒక్క స్థానమైనా దక్కించుకోలేని స్థితిలో బిజెపి కొట్టుమిట్టాడుతోంది. తమిళనాడులో నమితకు విశేష ఆదరణ ఉది. దీంతో తమిళనాడులో బిజెపి దశను మార్చేందుకు ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సూచనతోనే బీజేపీలో చేరేందుకు నమిత సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

నమిత 1998లో మిస్ సూరత్‌గా ఎంపికైంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో ఆమె నటించింది. ఆమె ఆర్యన్ రాజేష్ సరసన సొంతం సినిమాలో నటించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. లవ్ కే చక్కర్ మే సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

English summary

 Actress Namitha has condemned her political entry buz. Buz in Kollywood is actress Namitha may join in BJP. She made her acting debut in the Telugu film Sontham opposite to Aaryan Rajesh,directed by Sreenu Vitla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X