అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత అభివృద్దిలో మహిళాసాధికారత కీలకం: సూకీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Aung San Suu Kyi
అనంతపురం/న్యూఢిల్లీ: మయన్మార్ ప్రతిపక్ష నేత, నోబెల్ అవార్డు గ్రహీత ఆంగ్ సాన్ సూకీ శనివారం అనంతపురం జిల్లాలోని పాపసానిపల్లిలో పర్యటించారు. పోదుపు సంఘాల పనతీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు చక్కగా ఉపయోగపడుతుందని కొనియాడారు. తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు సలహాదారును మాత్రమేనని తెలిపారు. అనంతరం అనంతపురం ప్రజల ప్రేమాభిమానాలను తన వెంట తీసుకెళ్తున్నానని చెప్పారు.

కాగా పాపసానిపల్లె దళితవాడకు ఆంగ్ సాన్ సూకీ కాలనీగా నామకరణం చేశారు. దళితవాడకు తన పేరు పెట్టడం పట్ల సూకీ హార్షం వ్యక్తం చేశారు. అంతక ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాపసానిపల్లెలో రూ. కోటితో రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ. 20 లక్షల వ్యయంతో త్రాగునీటిని అందిస్తామని, అలాగే పది లక్షల వ్యయంతో పొదుపు సంఘం భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.

దీంతో అనంతపురం జిల్లాలో ఆంగ్ సాన్ సూకీ పర్యటన ముగిసింది. ఆమె తన పర్యటనను ముగించుకోని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగుళూరు బయల్దేరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూకీకి బుద్దిని బొమ్మ బహుకరించగా, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆమెకు ధర్మవరం పట్టుచీరను అందచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆంగ్ సాన్ సూకీ పాపసానిపల్లికి రానున్న నేపథ్యంలో ఆమె రాక కోసం గ్రామం ముస్తాబైంది. సూకీకి స్థానికులు రాయలసీమ రుచులు చూపించారు. గ్రామంలోని అందరూ గ్రామాన్ని సూకి రాక కోసం ముస్తాబు చేశారు. తోరణాలతో, రంగోళీలతో గ్రామాన్ని అలంకరంగా తీర్చిదిద్దారు.

పాపసానిపల్లి అనంతపురం జిల్లాలోని కర్నాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో 16 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామం అదర్శ గ్రామంగా నిలిచింది. దీంతో దీన్ని సందర్శించేందుకు సూకీ వస్తున్నారు. జిల్లా అధికాలులు మాట్లాడుతూ.. తాము సూకీకి రాయలసీమ తీపి పదార్థాలు రుచి చూపిస్తామని చెబుతున్నారు. కజ్జికాయలు, రవ్వ లడ్డు, అత్తి రసాలు, కొడుబాలే, రాగి, జొన్న, సబ్జి రోటీ తదితరాలను ఆమెకు ఆఫర్ చేస్తామని చెబుతున్నారు.

English summary
Myanmar's pro-democracy leader Aung San Suu Kyi on Saturday arrived in Andhra Pradesh's Anantapur district to study the socio-economic 
 
 transformation of people in villages brought about by various government welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X