వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలా, అమ్మో వద్దు: బాలీవుడ్ బాద్షా షారూఖ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
న్యూఢిల్లీ: తాను రాజకీయాల్లో అడుగు పెట్టబోనని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పష్టం చేశారు. పాత తరం నటులు అమితాబ్ బచ్చన్, శత్రుఘ్ను సిన్హా, రాజేష్ ఖన్నాల మాదిరిగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సుముఖంగా లేరు. రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి తనకు లేదని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఆ విషయం చెప్పారు.

షారూఖ్ ఖాన్‌కు పలువురు రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయి. అయినా ఆయన రాజకీయాల్లోకి కాలు పెట్టబోనని అంటున్నారు. శుక్రవారం జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో రాజకీయాల పట్ల తన ఆనాసక్తిని వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులతో పాటు షారూఖ్ కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు.

భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా మారుతారా అని అడిగితే చాలా ఏళ్లుగా తనను ఈ ప్రశ్న వేస్తున్నారని, తనకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసునని, వారి పట్ల తనకు గౌరవం ఉందని, వారితో తాను మాట్లాడుతుంటానని, అయితే రాజకీయాలు తన వృత్తి కాదని అన్నారు.

చిత్రాలను నిర్మించి ప్రజలకు వినోదాన్ని ఆనందించడం తన పని అని, రాజకీయ ప్రపంచంలో ఎత్తుపల్లాలతో విసిగిపోయిన తన సినిమాలు చూసి ఊరట పొందాలని తాను కోరుకుంటానని ఆయన అన్నారు. షారూఖ్ ఖాన్‌కు గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. ఐపియల్ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక షారూఖ్ ఖాన్ ఐపియల్ టీమ్‌ను ప్రదర్శనను ప్రోత్సహించిన సంఘటనలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని షారూఖ్ అభిమానిస్తారు కూడా.

English summary
Bollywood superstar Shahrukh Khan would not follow in the footsteps of yesteryear actors like Amitabh Bachchan, Shatrughan Sinha and Rajesh Khanna and end up joining politics. The actor has put all speculations to rest after he told media persons that he was not interested in joining politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X