వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి ఫేవర్.. జగన్ మనిషి: మంద వర్సెస్ డికె అరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

DK Aruna-Manda Jagannadham
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి డికె అరుణ, మందా జగన్నాథం వచ్చే ఎన్నికల టిక్కెట్ విషయంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. మందకు టిక్కెట్ ఇవ్వవద్దని డికె అరుణ వర్గం డిమాండ్ చేస్తుండగా.. ఆమెకే టికెట్ ఇవ్వవద్దని మంద వర్గం ఎదురుదాడికి దిగితోంది. లోకసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా వివిధ స్థాయిల నాయకుల అభిప్రాయాల్ని సేకరించిందేకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓ కమిటీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గ నేతలతో పరిశీలకుడు ప్రశాంత్ ఠాగూర్ రెండు రోజుల క్రితం విడివిడిగా సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు ఎంపి మంద జగన్నాథంపై డికె అరుణ స్వయంగా ఆయనకు ఫిర్యాదు చేశారు. శనివారం కూడా నియోజకవర్గ నేతలతో ప్రశాంత్ భేటీ అయ్యారు.

ఈ భేటీలో డికె అరుణ, మంద వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారట. డికె అరుణ వర్గీయులు మంద స్థానంలో లోకసభకు మాజీ ఎంపీ మల్లు రవి పేరును సూచించారట. మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ వారికే పని చేస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎంపి కోటా నిధులు ఎవరెవరికి కేటాయించింది రికార్డులు పరిశీలించాలని కోరారట.

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి ఏమాత్రం కృషి చేయలేదని, ఆయనకే తిరిగి టిక్కెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి వర్గం హెచ్చరించిందట కూడా. మరోవైపు మంద వర్గీయులు డికె అరుణపై ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకుడు గతంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారని, ఆయనకే పదవులు ఇప్పింటారని వారు ఆరోపించినట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యతిరేకుల్ని డికె అరుణ ప్రోత్సహిస్తున్నారని, సిట్టింగ్ ఎంపీకే తిరిగి టిక్కెట్ ఇవ్వాలని ప్రశాంత్‌కు చెప్పారట.

English summary
DK Aruna versus Manda Jagannadham
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X