వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలం తర్వాత ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Another cyclone threat to AP
చెన్నై/హైదరాబాద్: రెండు వారాల క్రితం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను నీలం తుఫాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. నీలం అలా వెళ్లగానే తాజాగా మరో తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు పొంచి ఉంది. బంగాళాఖాతంలో విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 600 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.

ఇది క్రమంగా తుఫానుగా మారే అవకాశముందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడ్డదని, మరో తుఫాను వచ్చే అవకాశముందని చెప్పారు. మరో 48 గంటలు దీని ప్రభావం ఉంటుందని, సాయంత్రానికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని చెప్పారు.

వాయుగుండం సోమవారం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం నాటికి తుఫాను బలహీనపడుతుంది. మరో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో సముద్రంలో చేపలు పట్టడాన్ని అధికారులు నిషేధించారు.

వేటకు వెళ్లవద్దని మత్సకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరంలోని అన్ని పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. అన్ని జిల్లాల్లోని చలి పంజా విసురుతోంది.

English summary
After Neelam cyclone, the coastla region people are fearing with another cyclone threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X