వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై రాజకీయ కుట్ర, నన్ను మారిస్తే ఏం కాదు: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన ఆంగ్ల దినపత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని బొత్స చెప్పారు. తాను నామినేటెడ్ అభ్యర్థినని, తనను మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్లు తనకు తెలియదన్నారు.

ఆ లేఖను చూడలేదన్నారు. తనకు తెలిసి అవన్నీ ఊహాజనిత కథనాలే అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. కొందరు కుట్రపూరితంగా పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు.

కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్‌తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాంధీ భవనంలో కెవిపి రామచంద్ర రావుతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.

కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి ఉంటారని తాను భావించడం లేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తాము 174 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరో రెండు వైద్య కళాశాలలు వచ్చాయని చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana has suspected political conspiracy on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X