వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వైపు జంప్‌లు: అధిష్టానం రెస్పాన్స్, మార్పుపై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి సొంత పార్టీ ప్రజాప్రతినిధులు వెళుతున్నారనే వార్తల పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం మంగళవారం స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ బలంగానే ఉందని కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ పర్యవేక్షకులు వాయలార్ రవి మీడియాతో చెప్పారు. పార్టీ నుండి కొంతమంది నేతలు వెళ్లిపోయినా ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీ పరిస్థితి బాగుందని, స్వలాభం కోసమే కొందరు వెళుతుండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది వెళ్లడం లేదన్నారు.

కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. ఆయన లేఖ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అధిష్టానానికి అభిప్రాయం తెలిపే హక్కు ఆయనకు ఉందని, సీనియర్ నేతగా పరిస్థితులపై ఆయన లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. వారం రోజులుగా రాష్ట్ర పరిస్థితులపై తాను ఎవరితోనూ మాట్లాడటం లేదని, ముఖ్యమంత్రిని మార్చే విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పలువురు నేతలు వెళ్తారనే ప్రచారంపై ఆ పార్టీ నేత పాలడుగు వెంకట్రావు కూడా హైదరాబాదులో మండిపడ్డారు. కొందరు నేతలు బయటకు వెళ్లడం వల్ల కాంగ్రెసు పార్టీకి కొంత నష్టం జరగడంలో వాస్తవమున్నప్పటికీ మారుతున్న వ్యక్తి ఎలాంటి వారో ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. వారు మార్కెట్ వ్యక్తులు అని ప్రజలు గుర్తిస్తారన్నారు. పార్టీకి నష్టమే అయినా పెద్దగా ఉండదన్నారు.

మనం ఆ పార్టీలోకి వెళ్తే ప్రజలు కూడా తమ వెంట వస్తారని అనుకోవడం తప్పవుతుందన్నారు. ప్రజలు అన్నింటిని పరిశీలిస్తున్నారని, వెళ్తామని చెప్పే వారు కాంగ్రెసులో ఏం తప్పుందో చెప్పాలని నిలదీశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని మరిచి నాయకులు పార్టీని వదిలి పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి పవర్ కుమార్ బన్సాల్ చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే వార్తలు కేవలం ఊహాజనితం మాత్రమే అన్నారు.

English summary
Central Minister Vayalar Ravi responded on jumpings on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X