వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో థాకరేపై వ్యాఖ్య: ఇద్దరు అమ్మాయిల అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bal Thackeray
ముంబయి: శివ సేన అధినేత బాల్ థాకరే మృతి తర్వాత ముంబయి బంద్ పైన ఫేస్ బుక్‌లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. బాల్ థాకరే మృతి సందర్భంగా ఆదివారం ముంబయిలో బంద్ పాటించడాన్ని ఫేస్ బుక్‌లో ఆ ఇద్దరు యువతులు ప్రశ్నించారు. వారిపై సేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.

థాకరే వంటి వారు ప్రతి రోజు పుడుతుంటారు... మరణిస్తుంటారు... ఇందుకు బంద్ పాటించాల్సిన అవసరమేముందని థానే జిల్లాకు చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల షహీన్ దాఢా ఫేస్ బుక్‌లో రాసింది. ఈ వ్యాఖ్యలను ఆమె స్నేహితురాలు రీతు సమర్థించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పర్చారు. కోర్టు వారికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది.

ఆ వెంటనే వారికి రూ.15వేల పూచీకత్తుపై బెయిల్ లభించింది. వీరిపై స్థానిక శివ సేన కార్యకర్తలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు యువతులను అరెస్టు చేసిన అధికారులను తక్షణం తొలగించాలని, లేదంటే మీ పైనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూ లేఖ రాశారు. ఫేస్ బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఢా అంకుల్ క్లినిక్‌పై దాడి చేశారు. క్లినిక్ పైన దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.

English summary
Two girls from nearby Thane district were arrested by the Mumbai Police for posting a Facebook comment that questioned the bandh in Mumbai following Shiv Sena leader Bal Thackeray's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X