వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తుపడ్తారా: కిషోర్ చంద్రదేవ్‌పై నిప్పులు చెరిగిన దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagendar
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను తప్పుపడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పైన కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ బుధవారం మండిపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు కాంగ్రెసులో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవులు పొందేందుకు తహతహలాడుకున్నారని విమర్శించారు.

ఆ రెండు పదవులు ముళ్ల కిరీటాలలాంటివన్న సంగతి పార్టీ నేతలు గుర్తిస్తే మంచిదన్నారు. కొందరు నేతలకు గాంధీ భవనం తెలియదని, వారు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కిషోర్ చంద్రదేవ్ వంటి నేతలు గాంధీ భవనంకు వస్తే ఎవరూ గుర్తు పట్టరని విమర్శించారు. అలాంటి వాళ్లు కిరణ్, బొత్సలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కిషోర్ చంద్రదేవ్ లాంటి నేతలు కేవలం ఢిల్లీకే పరిమితం అవుతారని, రాష్ట్రం గురించి, స్థానిక ప్రజల గురించి అతనికి ఆలోచన లేదని మండిపడ్డారు. సొంత లాభం కోసం పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. గాంధీ భవన్ అంటే తెలియని నేతలు పార్టీలో 90 శాతం మంది ఉన్నారన్నారు.

English summary

 No one indentyfy central minister Kishore Chandra Dev in Gandhi Bhavan, alleged minister Danam Nagendar on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X