వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్ థాకరేపై వ్యాఖ్య, అమ్మాయిల అరెస్ట్: సరైనదేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Comments on Thackeray: Dhada says sorry
ముంబై: శివసేన అధినేత బాల్ థాకరే మృతి తర్వాత ముంబై బంద్ పైన ఇద్దరు అమ్మాయిలు పేస్‌బుక్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా మహారాష్ట్రలో చర్చ నడుస్తోంది. థానే జిల్లాకు చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల షహీన్ దాఢా ఫేస్‌బుక్‌లో 'థాకరే వంటి వారు ప్రతి రోజు పుడుతుంటారు... మరణిస్తుంటారు... ఇందుకు బంద్ పాటించాల్సిన అవసరమేముంద'ని రాసింది. దానిని ఆమె స్నేహితురాలు రేణూ సమర్థించారు.

దీనిపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం... వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయడం... వారికి బెయిల్ లభించడం తెలిసిన విషయమే. దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, థాకరేపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయడమేమిటని కొన్ని సంఘాలు, పార్టీలు ప్రశ్నించాయి. అరెస్టు చేయడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అని కొందరు విమర్శిస్తున్నారు.

అయితే విమర్శకులకు ఎక్కువ మంది ధీటైన సమాధానమే ఇస్తున్నారు. భారత దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదనేది ఎవరూ కాదనలేని నిజమని అయితే ఇతరుల మనసులు నొప్పించే భావ ప్రకటన సరికాదనే విషయాన్ని విమర్శలు చేస్తున్న వారు గుర్తించాలని చెబుతున్నారు. మరికొందరు అమ్మాయిల అరెస్టును తప్పుపడుతున్నప్పటికీ థాకరేపై వారి వ్యాఖ్యలను మాత్రం సమర్థించడం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని చెబుతున్నారు.

భావ ప్రకటన అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కాదంటున్నారు. అలాంటి భావ ప్రకటనే అయితే ఏ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని, ఏ పార్టీని టార్గెట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తమను కించపరుస్తున్నారంటూ కూడా ఎవరూ ముందుకు రాకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే సామాజిక వెబ్ సైట్లు వెలుగులోకి వచ్చాక ఇలాంటివి పరిపాటిగా మారాయని, అరెస్టు చేయాల్సినంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది మరికొందరి వాదన.

ఓ ముఖ్యనేత మృతి చెందిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని, ముంబై నగరం మొత్తం శోకసముద్రంలో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. కార్యకర్తలు, అభిమానులు విచారంగా ఉన్న సమయంలో వారి మనసులను మరింత నొప్పిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పే అంటున్నారు. వేదనతో ఉన్న మనసులను మరింత గాయపరిస్తే వారిలో ఆవేశం పెల్లుబుకడంలో అర్థముందంటున్నారు.

ముఖ్యమైన వారు మృతి చెందినప్పుడు వారి ప్రత్యర్థులు కూడా వారి గురించి పొగడ్తలతో ముంచెత్తుతారని, ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడిపిన శివసేన అధినేత థాకరేపై మృతి చెందిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలేమిటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ సమయంలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా అభ్యంతరం ఉండేది కాదంటున్నారు. కాగా థాకరే మృతిపై షహీన్ దాఢా మంగళవారం క్షమాపణలు చెప్పారు. తనకు థాకరే అంటే అభిమానమని, ఆయన గొప్ప దేశభక్తుడు అని, క్యాజువల్‌గా కామెంట్ చేశానన్నారు. కానీ ఎవరి మనసులు నొప్పించాలని కాదని చెప్పారు.

English summary
A day after being arrested for posting comments on Facebook against the shutdown in Mumbai following Shiv Sena chief Bal Thackeray's death, Shaheen Dhada said she had made the comments casually, without intending to hurt any one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X