హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పినా ఆసక్తిచూపని పాక్: ఎరవాడ జైల్లో కసబ్ ఖననం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
న్యూఢిల్లీ: ముంబయి దాడుల మారణ హోమం కేసులో నిందితుడు అజ్మల్ కసబ్‌ను పూణేలోని ఎరవాడ జైలులో బుధవారం ఖననం చేశారు. కసబ్‌ను బుధవారం ఉదయం ఏడు గంటలకు ఎరవాడ జైలులోనే ఉరి తీసిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఉరి తీసిన ఎరవాడ జైలులోనే అధికారులు కసబ్ మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కసబ్ ఉరి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు, కసబ్ కుటుంబ సభ్యులకు తెలియజేసిందని చెప్పారు. ముంబయి దాడుల ఘటనలో కసబ్ ఒక్కడే పట్టుబడ్డారని చెప్పారు. రాష్ట్రపతి కసబ్ క్షమాభిక్షను 5న తిరస్కరించారని, 7న నిర్ణయం తీసుకున్నామని, 8న మహా ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.

26/11కు సంబంధించి న్యాయపరమైన అంశాలు అన్ని పూర్తయ్యాయని చెప్పారు. పాక్‌కు రాయభారి కార్యాలయం ద్వారా సమాచారం అందించామన్నారు. కసబ్‌ను ఉరితీస్తున్నట్లు పాకిస్తాన్‌కు ముందే సమాచారమిచ్చామని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కసబ్ ఉరిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమయిందని ఆయన చెప్పారు. కసబ్ కుటుంబ సభ్యుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

నిందితులు ఎవరైనా ప్రజాస్వామ్య భారత్‌లో శిక్ష ఒకేవిధంగా ఉంటుందని కసబ్ ఉరి ద్వారా తేటతెల్లమయిందని చెప్పారు. రెండు రోజుల క్రితమే ఎరవాడకు తరలించామని ముఖ్యమంత్రి చెప్పారు. నిందితులు ఎవరైనా శిక్ష తప్పదని, కసబ్ విషయంలోనూ అదే జరిగిందన్నారు.

English summary

 The Supreme Court of India announced death sentence for Mumbai 2008 terror attack suspect Ajmal Kasab. The apex court rejected the plea by the terrorist challenging the death sentence and upheld the death sentence given by Bombay High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X