వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తృణమూల్ అవిశ్వాస నోటీసు: వేడి రగిల్చిన టి-ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana- Mamata Banerjee
న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంటు సమావేశాలు గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. సభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఎంపీగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. మృతి చెందిన నేతలకు సంతాపం తెలిపారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు, శివసేన అధినేత బాల్ థాకరే మృతికి లోకసభ సంతాపం తెలిపింది. నీలం తుఫాను బాధితులకు సంతాపం తెలిపింది.

కాగా సమావేశాల ప్రారంభాలకు ముందు తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానంపై నోటీసును లోకసభ స్పీకర్ మీరాకుమార్‌కు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఎఫ్‌డిఐలపై ఓటింగ్ కోసం నోటీసులు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై వోటింగ్‌కు నోటీసులు ఇచ్చింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రజా సమస్యల చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలని సూచించారు. సమావేశాలు ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల కలిగే లాభాలను గుర్తించాలన్నారు.

కాగా 184వ నిబంధన కింద చర్చ, ఓటింగ్‌కు కోరుతూ ప్రతిపక్షాలు స్పీకర్‌కు 20 నోటీసులు ఇచ్చాయి. బిజెపి 13, జెడి(యు) 2, సిపిఎం 2, సిపిఐ 1, తృణమూల 1, టిడిపి 1 ఇచ్చాయి. కాగా చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై బిజెపి సహా ఇతర ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి.

ప్రారంభానికి ముందే తెలంగాణ వేడి, ఎంపీలు గైర్హాజరు

తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సమావేశాల ప్రారంభానికి ముందే వేడి పుట్టించారు. ఒకటో నెంబరు గేటు వద్ద ఎంపీలు తెలంగాణ కోరుతూ ఆందోళన నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము సమావేశాలకు హాజరవుతామని వారు చెప్పారు. జై తెలంగాణ అంటూ గేటు వద్ద వారు నినాదాలు చేశారు.

పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య, మంద జగన్నాథం, మధుయాష్కీ, జి.వివేక్‌లు పార్లమెంటు ఆవరణలోనే బైఠాయించారు.

English summary
Speaker Meira Kumar adjourned Lok Sabha till 12.00 clock on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X