వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ: నో హైకమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అర్వింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. దానికి ఆమ్ ఆద్మీగా నామకరణం చేశారు. తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుందని ఆయన తన పార్టీ పేరును ప్రకటిస్తూ చెప్పారు. తన పార్టీ గురించి ఆయన ట్వీట్ చేశాడు.

"నేను ఆమ్ ఆద్మీని. నేను స్వరాజ్ తెస్తాను. నేను లోక్‌పాల్ బిల్లు రూపొందిస్తాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 26వ తేదీ సోమవారంనాడు తనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలవాలని ఆయన ప్రజలను కోరారు. దయచేసి, 26న రావాలని, ఆ రోజు సభ్యులుగా చేరే వారంతా పార్టీ వ్యవస్థాపక సభ్యులవుతారని ఆయన అన్నారు.

కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరులు సమావేశమై పార్టీ పేరును, పార్టీ గుర్తును ఖరారు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడి సామాన్యుడి చేతిలో ప్రజాస్వామ్య శక్తిని పెడతామని కేజ్రీవాల్ అన్నారు.

పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీకి అధిష్టానమంటూ ఏదీ ఉండదు. ఒక కుటుంబ ఆధిపత్యం పార్టీపై ఉండదు. అంతర్గత లోక్‌పాల్ ఉంటుంది. నిర్మాణంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అత్యంత ప్రగతిశీలమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుంది.

పార్టీని నడిపించడానికి జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. 30 మందితో జాతీయ కార్యవర్గం ఉంటుంది. పార్టీ కోసం ప్రత్యేక నిబంధనావళిని రూపొందిస్తారు. ప్రజలు నేతలతో విసిగిపోయినందున పార్టీలో నేతలెవరూ ఉండరు.

English summary
Social activist-turned-politician Arvind Kejriwal and his team finally decided their party name. Announcing the name of the party, Kejriwal on Saturday, Nov 24 claimed that his party would bring "Swaraj (democracy)" in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X