వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలహీనపడుతాం: పల్లంరాజు, చచ్చేది మేమే: గుత్తా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gutta Sukhemder Reddy - Pallam Raju
నల్లగొండ: దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పెద్దరాష్ట్రంమని, 42 లోకసభ స్థానాలతో బలమైన రాష్ట్రమనిస ఇటువంటి రాష్ట్రం రెండుగా విడిపోతే బలహీన పడతామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లంరాజు అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో తాను అనవల్సినమాట కాదని, కానీ తెలంగాణ కోరుతున్నవారిని నేను ప్రాధేయపడేదేమిటంటే రాష్ట్రం రెండుగా విడిపోతే బలహీన పడతామని గుర్తించుకోవాలని అన్నారు.

సెంటిమెంట్‌ను గౌరవిస్తామని, కానీ దానికి ఒక పరిష్కారం కావాలని, అది సక్రమంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ పలు రాష్ట్రాలలో కూడా ఉందని, దేశంలోని పరిస్థితులను సమతుల్యం చేస్తూ సరియైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

రాష్ట్ర విభజనపై స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏ నాయకుడైనా ఎటువంటి డిమాండ్ చేసినా తప్పులేదని ఆయన చెప్పారు. తెలంగాణను కేంద్రం విస్మరించలేదన్నారు. తెలంగాణ ఎంపీల డిసెంబర్ 9 డెడ్‌లైన్‌పై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. దీనిపై ప్రభుత్వం, పార్టీ దృష్టి సారిస్తుందని అన్నారు.

ఇదిలావుంటే, "తెలంగాణ ఇచ్చేది మేమే..తెచ్చేది మేమే.. ఇవ్వకపోతే చచ్చేదీ మేమే'' అని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామని, విప్‌ను కూడా ధిక్కరించామని చెప్పారు. పార్టీ తెలంగాణలో చావకుండా ఉండాలంటే తక్షణమే తెలంగాణాపై ప్రకటన చేయాలని, ఈ ప్రాంత ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలని కోరారు. ఏపార్టీలోనూ తాము చేరబోమని చెప్పారు. తెలంగాణా ఇ్వకపోతే తెలంగాణవాదులందరం కూర్చుని ఏమి చేయాలో నిర్ణయించు కుంటామని పేర్కొన్నాచెప్పారు.

English summary

 Union minister Pallamraju has opposed the division of Andhra Pradesh. He said that if state will be divided, we will weaken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X