హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్య చేసుకుంటా: టిడిపి ఎమ్మెల్యే కంట కన్నీరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శాసన సభ్యుడు కెఎస్ రత్నం మంగళవారం కన్నీరు కార్చారు. తన నియోజకవర్గం పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని రత్నం ఆరోపించారు. తాను దళితుడినని, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని అయినందు వల్లే కిరణ్ తన నియోజకవర్గం పట్ల చిన్న చూపు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం రోజు తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

అదే రోజు ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగా తన శవయాత్ర చేయాలని అన్నారు. నియోజకవర్గానికి సరైన నిధులు కేటాయించాలని ఆయన అన్నారు. అధికార పార్టీ నియోజకవర్గం కాకపోయినంత మాత్రాన నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగని పని అన్నారు.

కాగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా తన నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. నేతలు టివిలలో బొమ్మలు చూపించుకొని ప్రకటనలకు పరిమితం అవుతున్నారని డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం విమర్శించారు. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శివును ఆజ్ఞతో పాలకులలో కనువిప్పు కలిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

ఇటీవల నీలం తుఫాను కారణంగా కొన్ని జిల్లాలు వరదలతో, వర్షాలు లేక మరికొన్ని జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతుంటే కొందరు నేతలు మాత్రం టీవిలలో తమ బొమ్మలు చూపించుకొని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని విమర్శించారు. నాద నాగేశ్వర కోన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏకవ్యక్తి పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కేవలం తనకు అనుకూలంగా ఉన్న మంత్రులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, ఇతరులకు కేటాయించడం లేదని ఆరోపించారు.

English summary
Telugudesam Party Chevella MLA wept on Tuesday for Kiran Kumar reddy not giving funds to his constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X