హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధలో కాకుండా ఇంకెప్పుడు: కిరణ్‌ రెడ్డికి డిఎల్ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ నెల 24వ తేదిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సిఎస్ మిన్నీ మాథ్యూకు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు సిబిఐ విచారణకు నిరాకరిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై తాను లేవనెత్తిన అభ్యంతరాలను కచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలని ఆయన వారిద్దరికీ లేఖ రాశారు. తన అభ్యంతరాన్ని నమోదు చేయకుంటే సరికాదన్నారు.

అలా చేస్తే తాను నేరుగా గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన అభ్యంతరాలను తెలియజేస్తానని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై సిఎస్ ఫోన్‌లో సంప్రదిస్తే తనకు అభ్యంతరాలు ఉన్నట్లు డిఎల్ చెప్పారు. ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ధర్మాన అంశం ఒక్కటే కాకుండా పలు అంశాలను ప్రస్తావించారట. ప్రజలు కరువు, వరదల లాంటి బాధల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోకుంటే ఏం లాభమని సిఎం కిరణ్‌ను ప్రశ్నిస్తూ డిఎల్ ఆ లేఖ రాశారట.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లుగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికా నిధులకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు సిఎంను డిఎల్ అభినందించారట. అదే సమయంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని, 18 జిల్లాల్లో అకాల వర్షాలతో పంట నీటిపాలై రైతులు నిండా మునిగిపోయారని, కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలని సూచించారట.

రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే కరువు, వరదలతో నష్టపోయిన రైతుల గురించి, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి చర్చించాలని చెప్పారట. ఇన్‌పుట్ సబ్సిడీని పెంచాలని సూచించారని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన తొమ్మిది సిలిండర్ల హామీని అమల తక్షణమే అమలు చేయాలని సూచించారట.

English summary
Minister DL Ravindra Reddy has wrote a letter to CM Kiran Kumar Reddy about people problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X