వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను సీతయ్య!: రిజైన్‌పై పెద్దిరెడ్డికి జైపాల్, డిఎస్ ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్‌లు బుధవారం పెద్దిరెడ్డికి ఫోన్ చేశారు. రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు తదితర అంశాలు పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తాయని, ఇలాంటి స్థితిలో రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరినట్లుగా సమాచారం.

డి.శ్రీనివాస్, జైపాల్ రెడ్డిల ఫోన్‌కు పెద్దిరెడ్డి అంతే ఘాటుగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, గురువారం రాజీనామా చేస్తానని తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా కిరణ్ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా అధిష్ఠానం కొనసాగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఈ నెల 30 లోగా ముఖ్యమంత్రిని మార్చకుంటే.. తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన 30వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ తాను 29వ తేదీననే రాజీనామా చేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.

రాజీనామాను సమర్పించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే చిత్తూరు నుండి హైదరాబాదుకు బయలుదేరారు. ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తును అడ్డుకుంటున్నారని, తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి రాజీనామా, డిఎల్ అంశం కాంగ్రెసు పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది.

English summary
Central Minister Jaipal Reddy and former PCC chief D Srinivas make phone to former minister Peddireddy Ramachandra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X