వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలీనం చేస్తానని బురదజల్లకు: కెసిఆర్‌కు పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే చెప్పారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మంగళవారం అన్నారు. తనకు టిఆర్ఎస్‌ను కొనసాగించే ఉద్దేశ్యం లేదని.. పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ ప్రతిపాదించారని, అందుకు తనకు ఎలాంటి పదవి కూడా వద్దని చెప్పారని, కానీ కాంగ్రెసుకు, కెసిఆర్‌కు మధ్య ఒప్పందం కుదరలేదని చెప్పారు.

ఇప్పుడు కెసిఆర్ తమ పార్టీ పైన బురద జల్లాలని చూడటం మంచిది కాదన్నారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీని బేషరతుగా విలీనం చేస్తానని చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు తమను విమర్శించవద్దన్నారు.

సోనియా గాంధీకి తెలియకుండా ఈ రోజుల్లో పిట్ట కూడా లేవదని, కాబట్టి కెసిఆర్‌ను ఎవరు పిలిచారు, ఎలా పిలిచారన్నది ఇప్పుడు అప్రస్తుతమన్నారు. కాగా సోమవారం వాయలార్ రవి మాట్లాడుతూ... కెసిఆర్‌ను ఎవరు పిలిచారో తనకు తెలియదని చెప్పిన విషయం తెలిసిందే. చర్చల కోసం కె.చంద్రశేఖర రావును ఎవరు పిలిచారో తనకు తెలియదని వాయలార్ అన్నారు. వాయలార్ రవి వ్యాఖ్యలపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary
MP Palvai Govardhan Reddy blamed TRS chief K Chandrasekhar Rao about TRS merger issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X