వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో ఎస్సార్సీ: విభజనపై సోనియాకు గాదె సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy-Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పరిష్కారం విషయమై మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి బుధవారం ఓ లేఖ రాశారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన తన లేఖలో సోనియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో సూత్రాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అందులో సూచించారు.

తెలంగాణ సమస్యను వెంటే తేల్చడం కష్టమని, కాబట్టి రెండో ఎస్సార్సీ వేస్తే బావుంటుందని ఆయన సూచించారు. తెలంగాణకు రాజకీయ, ఉపాధి అవకాశాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అలా అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తగ్గుతుందని గాదె సూచించినట్లుగా తెలుస్తోంది. గాదె వెంకట రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

కాగా తెలంగాణ వేడి కాంగ్రెసును గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఆ కమిటీ తెలంగాణపై ఆరు సూత్రాలను సూచించింది. అందులో తెలంగాణకు ప్యాకేజీ కూడా ఒకటి.

English summary
Former Minister Gade Venkat Reddy has wrote a letter to AICC president Sonia Gandhi on Telangana issue. He suggested second SRC on Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X