For Daily Alerts
రెండో ఎస్సార్సీ: విభజనపై సోనియాకు గాదె సూచన
తెలంగాణ సమస్యను వెంటే తేల్చడం కష్టమని, కాబట్టి రెండో ఎస్సార్సీ వేస్తే బావుంటుందని ఆయన సూచించారు. తెలంగాణకు రాజకీయ, ఉపాధి అవకాశాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అలా అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తగ్గుతుందని గాదె సూచించినట్లుగా తెలుస్తోంది. గాదె వెంకట రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తెలంగాణ వేడి కాంగ్రెసును గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఆ కమిటీ తెలంగాణపై ఆరు సూత్రాలను సూచించింది. అందులో తెలంగాణకు ప్యాకేజీ కూడా ఒకటి.
Comments
gade venkat reddy sonia gandhi telangana srikrishna committee new delhi గాదె వెంకట రెడ్డి సోనియా గాంధీ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ
English summary
Former Minister Gade Venkat Reddy has wrote a letter to AICC president Sonia Gandhi on Telangana issue. He suggested second SRC on Telangana statehood.