వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పార్టీలో కర్చీఫ్, వెళ్లు అంతేకానీ: పెద్దిరెడ్డిపై వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy - Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన పుంగనూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై కాంగ్రెసు పార్టీ ఎదురుదాడికి దిగింది. గురువారం కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా సమర్పించిన పెద్దిరెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి సోదరుడు కిషోర్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉందని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు.

కాంగ్రెసు పార్టీలో ఉండి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కర్చీప్ వేసుకుంటూ సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే పలువురు తమ వారసులను ఆ పార్టీలోకి పంపించి రిజర్వ్ చేసుకున్నారన్నారు. అలాంటి వారిలో పెద్దిరెడ్డి కూడా ఒకరు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునని, కానీ కాంగ్రెసుపై విమర్శలు చేస్తూ వెళ్లడం సరికాదన్నారు.

గత శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బి ఫారం ఇచ్చిన వ్యక్తిని పెద్దిరెడ్డి ఓడించారన్నారు. కాంగ్రెసును నాశనం చేసేందుకు డ్రామాలు ఆడితే ఊరుకునేది లేదన్నారు. పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పుంగనూరుకు నిధులు, పనులు కిరణ్ అడ్డుకున్నారని పెద్దిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రిని మార్చితేనే ఉంటానని పెద్దిరెడ్డి పార్టీ అధిష్టానాన్ని, సోనియా గాంధీని హెచ్చరించినట్లుగా మాట్లాడటం శోచనీయం అన్నారు. కొందరు సీనియర్ నేతలు తమ వారసులను జగన్ పార్టీలోకి పంపి కాంగ్రెసు పార్టీని ఉద్దేశ్య పూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.

పార్టీలో చర్చించాలి

ముఖ్యమంత్రిపై పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని సిఎల్పీ సోనియా గాంధీకి అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏవైనా అభిప్రాయాలు ఉంటే పార్టీలో చర్చించాలని ఇలా బయటపడటం సరికాదన్నారు. సిఎల్పీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాతే సోనియాకు బాధ్యత అప్పగించామన్నారు. పెద్దిరెడ్డి వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు.

English summary
Kamalapuram MLA Veerasiva Reddy alleged that former 
 
 Minister Peddireddy Ramachandra Reddy was reserved 
 
 his ticket in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X