హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారసుడు రెడీ: శ్రీకాకుళం లోకసభకు ఎర్రన్న కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rammohan Naidu
హైదరాబాద్: దివంగత ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఖరారయ్యారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు ఉన్నన్నాళ్లూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు, సోదరుడు... ఇలా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ కూడా ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడును ఎంపిక చేసింది. శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడును నిలపాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రన్నాయుడు ఈ నెలలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆయన మృతి తర్వాత శ్రీకాకుళం జిల్లా టిడిపిలో రాజకీయ వారసుడి కోసం తీవ్ర చర్చ సాగింది. ఇప్పుడు శ్రీకాకుళం స్థానం నుండి రామ్మోహన్ నాయుడును రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించుకుంది. ఇక పార్టీ పోలిట్ బ్యూరోలోకి జిల్లా నుండి ఎవరిని తీసుకుంటారనే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పార్టీ సీనియర్ నేతలు పోలిట్ బ్యూరోపై ఆశలు పెట్టుకున్నారు. మరి అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.

English summary
Telugudesam Party is thinking give Srikakulam Lok Sabha ticket to Yerram Naidu's son Rammohan Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X