హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్మల్ కసబ్ ఉరి: హైదరాబాదులో తాలిబన్ల సంచారం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad-Ajmal Kasab
హైదరాబాద్: ముంబయి మారణకాండ నిందితుడు అజ్మల్ కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ తాలిబన్ గ్రూపు తమ కార్యాలయానికి ఫోన్ చేసినట్టు ఓ ఆంగ్ల దిన పత్రిక రాసింది. అజ్మల్ కసబ్ ఉరికి తాము నెలలోగా ప్రతీకారం తీర్చుకుంటామని తెహ్రీక్ ఏ తాలిబన్ గ్రూప్‌కు చెందిన అధికార ప్రతినిధి అహ్మద్ మార్వాత్ సదరు ఆంగ్ల దిన పత్రికకు బుధవారం గుర్తు తెలియని ప్రాంతం నుండి చెప్పినట్లుగా తెలిపింది.

కసబ్ మృతిని వృధా కానీయమని, తమ వాళ్లు హైదరాబాద్, అమృత్‌సర్ నగరాల్లో తిరుగుతున్నారని వారు త్వరలో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారని రాసింది. ఒక్క కసబ్ మృతికి ఆవేదన చెందిన ఎందరో ఇప్పుడు బలిదానానికి సిద్ధంగా ఉన్నారని తెలిపిందని రాసింది.

తెహ్రిక్ ఏ తాలిబన్ గ్రూపుకు చెందిన అధికార ప్రతినిధి హెచ్చరించడంతో ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్, అమృతసర్‌లతో పాటు దేశం నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసిన వెంటనే భారత్ పైన దాడులు తప్పవని తాలిబన్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

కాగా ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని హైదరాబాద్ సిపి అనురాగ్ శర్మ సూచించారు. ఐటి కంపెనీలకు, ప్రజలకు తాము తగిన రక్షణ కల్పిస్తామని, పోలీసులు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు.

English summary
A Pakistani Taliban faction has claimed that its fighters were holed up in Hyderabad and Amritsar to carry out attacks to avenge 26/11 convict Ajmal Kasab's execution last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X