హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీనియర్లతో కిరణ్ ఢీ: డిఎల్‌కువార్నింగ్, పెద్దిరెడ్డి డోంట్‌కేర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. అసెంబ్లీ శనివారానికి వాయిదా పడిన అనంతరం కిరణ్ మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై తాను ఎక్కువగా మాట్లాడనని చెప్పారు. తన నియోజకవర్గానికి చెందిన పనులను ఎప్పటి నుండో తన సోదరుడే చూస్తున్నారని చెప్పారు.

Kiran Kumar Reddy

అలాగే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విషయాన్ని ప్రస్తావించినప్పుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నిర్ణయాలతో విభేదించే వారిని తొలగించే అవకాశం తనకు ఉందని లేదంటే వారే రాజీనామా చేయవచ్చునని డిఎల్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ చెప్పారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ కేసులో సుప్రీం కోర్టు ఇలాంటి నిర్ణయాన్ని సమర్థించిందని కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కూడా పరోక్షంగా టార్గెట్ చేశారు. రాష్ట్రానికి ఇటీవల గ్యాస్ కేటాయింపులు మరింత తగ్గాయని అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు కేసు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కేసు వేరు అని కిరణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే ధర్మానపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ధర్మాన ఫైలు గవర్నర్ నరసింహన్ వద్ద ఉందన్నారు.

మీడియా మేనేజ్‌మెంటులో తాము వెనుకపడినప్పటికీ తాము టివి, పేపర్ కొనుగోలు చేయమన్నారు. తాను టివిని, పేపర్‌ను కొనుగోలు చేస్తానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని ప్రణాళికా సంఘానికి చెప్పామన్నారు. వచ్చే నెలలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి పరోక్షంగానైనా స్వపక్షంలోని వ్యతిరేక వర్గంపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. వచ్చే నెలలో రాష్ట్రానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. రాజకీయాల్లో తృప్తి, సంతృప్తికి తావు లేదన్నారు.

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. కేబినెట్ నుండి తొలగించే అధికారం తనకు ఉందని, గ్యాస్ విషయంలో ఇప్పుడు మరింత కేటాయింపు తగ్గిందని జైపాల్ రెడ్డిని టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజీనామా చేసినప్పటికీ దానిని డోంట్ కేర్ అన్న విధంగా మాట్లాడటం చూస్తుంటే కిరణ్ దూకుడుగా తన ఎదురు వర్గంపై ఎదురు దాడికి దిగేందుకే సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy is ready to face ministers DL Ravindra Reddy, Jaipal Reddy and former minister Peddireddy Ramachandra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X