వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ క్లోజ్డ్: లగడపాటి, ఏదైనా: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య సమసిపోయిందని, విభజన సమస్య ఇక లేదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమస్య సమసిపోయినందువల్లనే తాను కొద్ది కాలంగా తెలంగాణపై మాట్లాడటం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను, ప్రవేశపెట్టిన పథకాలను సరిగా ప్రచారం చేసుకుంటే మళ్లీ అధికారం తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఏమైనా లోపాలు, పథకాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని సవరించుకుంటే సరిపోతుందని చెప్పారు.

రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నది నుంచి వరద నీరు తీసుకెళితే తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఉంటాయని, ఆ విషయాన్ని తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించిందని, ఈ లోపాలను సవరించుకుంటే తమ పార్టీదే మళ్లీ అధికారమని అన్నారు.

ఇదిలా వుంటే, తెలంగాణ సమస్యకు ఇంకా పరిష్కారం కనుగొనలేదని, ఈ అంశంపై తాము ఒక నిర్ణయానికి రాలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. గురువారం పార్లమెంటు భవనంలో ప్రధానిని పాల్వాయి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమస్యను ఏదో విధంగా పరిష్కరించాలని తాను కోరానని పాల్వాయి మీడియాకు వెల్లడించారు.

తెలంగాణ అంశంపై చాలామంది ఎంపీలు తనను కలుస్తున్నారని, వారు చెప్పింది తనకు అర్థమయ్యిందని, దీనికి పరిష్కారం కనుగొంటామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆంధ్రా ప్రాంతంలో పార్టీ పోయిందని, తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కుతాయని తాను చెప్పినట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal said that there is no Telangana issue and it is closed. Meanwhile, Rajyasabha member from Telangana said that Telangana issue should be solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X