హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైపాల్ రెడ్డీ కాంగ్రెసును వీడుతారు: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణపై పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పకపోతే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, సారయ్య, సుదర్శన్ రెడ్డి, తదితరులు పార్టీని వీడే అవకాశం ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, డిసెంబర్ 9వ తేదీ లోగా ఓ ప్రకటన వస్తుందని భావిస్తున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉందని ఆయన అన్నారు. ప్రస్థుత పరిస్థితుల్లో రాజకీయంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణవాదం వినిపించే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీలోగా ఓ స్పష్టత వస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని అంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూర్యాపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తేల్చకపోతే రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ నెలల ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకు తెలంగాణ కాంగ్రెసు నాయకులు పార్టీని విడే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ఫ్రంట్ మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రయత్నిస్తున్నారని, కెవిపి పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సులువు అవుతుందని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MLA R Damodar Reddy said that union minister s Jaipal Reddy along with state ministers K Jana Reddy, Saraiah and Sudarshan Reddy may leave Congress party, if Telangana state is not carved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X