వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే.. వైయస్ జగన్ తరహా యాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Uddhav Thackeray
ముంబయి: శివసేన ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఉద్దవ్ థాక్రే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తరహా యాత్ర చేపట్టనున్నారు. శివసేన సుప్రీమ్ బాల్ థాకరే ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత పార్టీని పటిష్ట పర్చేందుకు, తండ్రి స్థానంలో తనను ప్రజలు ఆదరించే వ్యూహంలో భాగంగా ఉద్దవ్ థాక్రే మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. యాత్రలో పార్టీ కార్యకర్తలను కలువనున్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన విషయం తెలిసిందే. వైయస్ చనిపోయిన తర్వాత నల్లకాల్వ వద్ద జగన్ తన తండ్రి హఠార్మణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారిని ఓదార్చుతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అతను ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పు యాత్ర జైలుకు వెళ్లే ముందు వరకు కూడా కొనసాగింది.

తెలంగాణ ప్రాంతంలోనూ ఓదార్పు చేపట్టాలకున్న సమయంలో ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. జైలు నుండి బయటకు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్రకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా చెబుతోంది. జగన్ ఓదార్పు తరహా ఇప్పుడు ఉద్దవ్ మహాయాత్ర చేయనున్నారు. ఏ అంశంతో యాత్ర చేపట్టినా జగన్, ఉద్దవ్ ఇద్దరు యాత్రలు తమ తండ్రులు మృతి చెందిన తర్వాత ప్రారంభిస్తున్నారు. వారి వారి రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం కోసమే ఈ యాత్రలు.

థాకరే స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

బాల్ థాక్రే సీట్లో కూర్చోలేనని, ఆయన స్థానాన్ని ఎవరూ పూడ్చలేరని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ అన్నారు. పార్టీ చీఫ్ పదవిని మరొకరితో పూర్తి చేయలేమని స్పష్టం చేశారు. శనివారం పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. ఆదివారం పత్రికలో ఇంటర్వ్యూ వివరాలు ప్రచురితమయ్యాయి. నవంబర్ 17న థాక్రే చనిపోయారని, అయినా ఎప్పటికీ ఆయన శివసేన చీఫ్‌గా, హిందువుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

English summary

 Reiterating his resolve to fight for ‘Marathi Manoos’, Shiv Sena executive president Uddhav Thackeray will soon tour the state to meet party workers across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X