వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో బాలయ్యతో ఢీ: కొడాలి నాని ధైర్యం ఆ నాలుగే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna - Kodali Nani
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలకు గుడివాడ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నాని మంగళవారం ధాటిగా తిప్పికొట్టారు. బాలయ్య వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూనే... గుడివాడలో పోటీకి రమ్మని సవాల్ విసిరారు. నందమూరి హీరో చేతిలో తాను ఓడితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని, ప్రక్క రాష్ట్రం వెళ్లి తలదాచుకుంటానని కూడా చెప్పారు.

తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా భావిస్తుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు అక్కడ నుండి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. ఇదే నియోజకవర్గంలో ఆయన జన్మించిన నిమ్మకూరు గ్రామం ఉంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ కలిగిన హీరోలలో బాలకృష్ణ ఉన్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ కొడాలి నాని ఏం చేసి అంత పెద్ద సవాల్ విసరడం గమనార్హం.

ఆయన ఏం చూసుకొని బాలయ్యకు సవాల్ విసిరారు. అంటే ఆయన ప్రధానంగా నాలుగింటిని చూసుకొని నందమూరి హీరోకు సవాల్ విసిరినట్లుగా చెప్పవచ్చు. హీరో జూనియర్ ఎన్టీఆర్ అండతో 2004లో రాజకీయ ఆరంగేట్రం చేసి గుడివాడ టిక్కెట్ దక్కించుకున్న నాని రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. గుడివాడలో టిడికి ఉన్న పట్టు కారణంగానే ఆయన విజయం సాధించారు.

అయితే ఇప్పుడు ఆయన తన సొంత బలం పెంచుకున్నారు. ఆయన తన సొంత బలం, వైయస్ జగన్ ప్రభావం, జూనియర్ ఎన్టీఆర్ అండ, కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న రావి వెంకటేశ్వర రావులు... ఇలా ఈ నాలుగింటి ధైర్యమే ఆయన బాలయ్య పైనా కూడా సవాల్ విసిరేంత దమ్ముకు కారణమంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ దాదాపుగా తొమ్మిదేళ్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్నారు. టిడిపి క్యాడర్ మొత్తం ఆయనే చుట్టూనే ఇన్నాళ్లు తిరిగింది.

చాలామంది టిడిపి అభిమానాన్ని క్రమంగా ఆయన తన వైపుకు మరల్చుకున్నారు. నియోజకవర్గంలో క్రమంగా తన పట్టు పెంచుకున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. అప్పటి టిడిపి కార్యర్తలు, స్థానిక నేతలు ఇప్పుడు పలువురు ఆయన వెంట ఉన్నారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం ఎలాగూ ఉంది. ఇంకో వైపు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ కూడా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజమెంతో అబద్దమెంతో కానీ ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నానిని స్వయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జూనియరే పంపారనే ఆరోపణలు రావడం, బయటకు వచ్చి ఆ యంగ్ హీరో వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. జూనియర్ చంద్రబాబు, బాలకృష్ణల పట్ల అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. దీంతో జూనియర్ అభిమానులు నానికే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు రావి వెంకటేశ్వర రావు నియోజకవర్గ టిడిపికి ఏళ్లుగా దూరంగా ఉండటంతో ఆయన పట్టు కోల్పోయారని నాని భావిస్తున్నారని అంటున్నారు. స్థానిక టిడిపి నాయకులు తనకు లోపాయకారిగా మద్దతు పలుకుతారనే భావనలో ఆయన ఉండవచ్చునని అంటున్నారు. నాని బలం వెనుక ఈ నాలుగు కారణాలే కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary

 Gudiwada MLA, YSR Congress party leader Kodali Nani is hoping that he will win in next general election if Hero Balakrishna contest from TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X