వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 నిమిషాలు లేట్: జగన్ పార్టీపై గాలి, నానికి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali MudduKrishnama Naidu
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో 12వ క్లాజు సవరణకు తాము డిమాండ్ చేసినప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు అన్నీ వెంటనే స్పందించాయని, కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం పది నిమిషాలు ఆలస్యంగా స్పందించిందన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని దానిని బట్టే అర్థమైందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఈడి ఎందుకు పిలిచి ప్రశ్నించడం లేదన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విడుదలైన 26 జివోల విషయంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను అరెస్టు చేసి మంత్రి ధర్మాన ప్రసాద రావును కాపాడటమేమిటని ప్రశ్నించారు. జగన్‌ క్విడ్ ప్రోకో కింద లబ్ధి పొందారని సిబిఐ చెబుతోందని, మంత్రులు తాము తప్పు చేయలేదని చెబితే జగన్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లేనని గాలి ముద్దుకృష్ణమ ఈ సందర్భంగా ఆరోపించారు.

జగన్‌ను, మంత్రులను రక్షించమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందా అని ప్రశ్నించారు. విజయమ్మ, భారతి రహస్యంగా కేంద్రమంత్రి అహ్మద్ పటేల్‌ను ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తమ నేత బాలకృష్ణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బాలకృష్ణకు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని చెప్పారు.

కానీ కొడాలి నాని గుడివాడలో తప్ప ఇంకెక్కడైనా పోటీ చేసి కనీసం వెయ్యి ఓట్లు తెచ్చుకుంటే తన చేయి తెగ్గోసుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడో ఓసారి పార్లమెంటుకు వెళతారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా అన్నారు. కెసిఆర్ ఒకవేళ పార్లమెంటుకు వెళ్లినా సభకు వెళ్లడన్నారు. అహ్మద్ పటేల్‌తోనే మరొకరితోనే మాట్లాడతారన్నారు.

English summary
Gali MudduKrishnama Naidu has accused YSR Congress was responded 10 minutes late in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X