హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోటల్లో బెయిల్ డీల్: ఎమ్మెల్యే కార్డ్‌తో సోమశేఖర బస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Somasekhar Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి ఎమ్మెల్యే కార్డుతో ఓ హోటల్‌లో బస చేసి గాలిని బయటకు తెచ్చేందుకు బెయిల్ డీల్ కోసం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సోమశేఖర్ రెడ్డితో పాటు ఇతరులు జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌ను వేదికగా చేసుకొన్నట్లు తేలిందట. దీంతో ఎసిబి అక్కడే ప్రధానంగా దృష్టి సారించింది. కేసును నిలబెట్టుకునేందుకు తమ వద్ద సాంకేతిక ఆధారాలున్నాయని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపింది.

ఎసిబి కోర్టుకు నివేదించిన దాంట్లో దసపల్లా హోటల్ నుంచి సేకరించిన ఆధారాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా దసపల్లా హోటల్ సిబ్బందిని విచారించిన ఎసిబి మొదటి కేసులో గాలిని ఏ-9గా చేరుస్తూ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌లో వారిచ్చిన వాంగ్మూలాల్ని జతచేసింది. డీల్ వ్యవహారం మొదటి నుంచి హోటల్‌లో ఎవరెవరు బస చేశారు, వారిని కలిసేందుకు ఎవరొచ్చారనే అంశాలపై ఆరా తీసింది.

నిందితులు చెప్పిన వివరాలను సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా సరి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2012 ఏప్రిల్ 12న హోటల్‌కొచ్చిన సోమశేఖర్‌ రెడ్డి రూం తీసుకునే సమయంలో గుర్తింపు కార్డుగా బళ్లారి ఎమ్మెల్యే ఐడి కార్డును చూపించారట. ఆ తర్వాత మే 9 నుంచి 13 వరకు జిడిఆర్ రెడ్డి, తిరుపతి చిరునామాతో దశరథరామి రెడ్డి కుటుంబ సభ్యులతో సహా 301, 305 గదుల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది.

English summary
It is said that Somasekhar Reddy, brother of Gali Janardhan Reddy was lodged at Jubilee Hills hotel for bail deal talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X