ys jagan ysr congress vasantha nageswara rao guntur వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు వసంత నాగేశ్వర రావు గుంటూరు
పదవి వల్లే చేరలేదు: జగన్ పార్టీలోకి జై ఆంధ్రా 'వసంత'

తాను రైతులకు సేవ చేసేందుకు వైయస్ అవకాశం కల్పించారన్నారు. రైతులకు సేవ చేసేందుకే వైయస్ తనకు కెడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, అందుకు ఆయన రుణం తీర్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని చెప్పారు. ఇప్పటి వరకు తాను ఆ పదవిలో ఉన్న కారణంగా వైయస్ జగన్ వెంట వెళ్లలేక పోయానని చెప్పారు.
వైయస్ చేపట్టిన పథకాల కారణంగానే తాము ప్రస్తుతం ప్రజల్లో తిరగగల్గుతున్నామని, ప్రజలకు జగన్ మేలు చేస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన తనయుడు కృష్ణ ప్రసాద్‌ను కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి రావాల్సిందిగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. కాగా సహకార ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఆయన జగన్ పార్టీలో చేరతానని, పదవిలో ఉన్నందునే ఇన్నాళ్లు చేరలేదని చెప్పడం గమనార్హం.
మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు, తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. అమర్నాథ్ రెడ్డి బుధవారం, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ నెల 16వ తేదిన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు తాను ఏ పార్టీలో చేరడం లేదని తెలంగాణ కోసమే ఉద్యమిస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండలో చెప్పారు.