హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నవస్తాడు: పిజెఆర్ కూతురు, ఫ్యామిలితో గంట జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి బయటకు వస్తారని స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి(పిజెఆర్) తనయ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయా రెడ్డి బుధవారం అన్నారు. జగన్ రిమాండ్ బుధవారంతో ముగియడంతో ఆయనను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు తరలించేందుకు చంచల్‌గూడ జైలు అధికారులు సిద్ధమైన సమయంలో ఆయనను చూసేందుకు విజయా రెడ్డి కూడా వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్ తప్పకుండా బయటకు వస్తాడన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన పని చేస్తారన్నారు. జగన్‌కు త్వరలో బెయిల్ దొరుకుతుందని తాము ప్రగాఢంగా విశ్వసిస్తున్నామని, ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని పాలిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేత, జగన్ సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని విజయా రెడ్డి అన్నారు.

షర్మిల వస్తున్నా మీకోసం పాదయాత్రకు తెలంగాణలో స్పందన లేదని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అవన్నీ అవాస్తవమన్నారు. రాయలసీమ ప్రాంతంలో వచ్చిన స్పందన కంటే తెలంగాణలోనే ఎక్కువగా వస్తోందన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమె యాత్ర కొనసాగుతుందన్నారు. జగన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారని, దూరం నుండి చూసేందుకైనా ఎగబడుతున్నారన్నారు.

సిబిఐ కోర్టులో జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు తరలించారు. జైలు నుండి బయటకు వచ్చిన జగన్ చిరునవ్వుతో నమస్కరించారు. అనంతరం నల్గొండ క్రాడ్ రోడ్, చాదర్‌ఘాట్ మీదుగా కోర్టుకు తరలించారు. జగన్ కోర్టు హాలుకు చేరుకున్నారు. కోర్టు హాలులో అందర్నీ పలకరించారు. ఓఎంసి, జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు నిందితులకు కోర్టు 19 వరకు రిమాండ్ పొడిగించింది. కాగా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు కోర్టు గంటసేపు అనుమతించింది.

English summary
late PJR daughter and YSR Congress party leader Vijaya Reddy has hoped that party chief YS Jaganmohan Reddy will come out soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X