వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదో డ్రామా, జోక్: కెసిఆర్, జగన్ ఓ జేబుదొంగ: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao - K Chandrasekhar Rao
న్యూఢిల్లీ/నల్గొండ: ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం అంటూ కేంద్రం చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం స్పందించారు. ఇది ఓ జోక్ అన్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంతకాలమైనా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. ఎఫ్‌డిఐ ఓటింగు నేపథ్యంలో తెలంగాణ ఎంపీల ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ ప్రకటన అన్నారు.

ఇదో డ్రామా మాత్రమే అన్నారు. ఈసారి జరిగే అఖిలపక్షానికి పార్టీల అధ్యక్షులనే పంపాలన్న నిబంధనను కేంద్రం విధించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వేరుగా డిమాండ్ చేశారు. గతంలో చెప్పాం, మా వైఖరిలో మార్పులేదు వంటి నాన్చుడు ధోరణులు వద్దని పార్టీలకు కెటిఆర్ హితవు పలికారు. రాష్ట్రంలోని పన్నెండు కోట్ల మంది ప్రజల జేబులు కొట్టిన దొంగ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ కోసమో, కరెంట్ చార్జీల తగ్గింపు కోసమో ఉద్యమాలు చేసి జగన్ జైలుకు వెళ్లలేదని, అవినీతి సంపాదనవల్ల ఊచలు లెక్కిస్తున్నారన్నారు. జగన్ పార్టీ కన్నీళ్ల డ్రామా ఆడుతోందన్నారు. ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో జగన్ రంగు బయటపడుతుందన్నారు. తెలంగాణకు కిరణ్, చంద్రబాబు, జగన్ అడ్డన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన కిరాతకుడు జగన్ అని దుయ్యబట్టారు.

కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీలోనే తెలంగాణ ఏర్పాటుపై రోడ్‌మ్యాప్ ప్రకటించాలని తెలంగాణ జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి ఫలించిందని, ఇక మంత్రుల వంతు మిగిలిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

English summary

 TRS chief K Chandrasekhar Rao has blamed Central Government for all party meet announcement. He was desribed it is drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X