వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తేది 28 ఉదయం 10 గంటలకు: ఎందర్ని పిలుస్తామో?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shinde announces date officially
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై కేంద్రం ఈ నెల 28వ తేదిన అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా తెలిపారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన షిండే... 28వ తేదిన ఉదయం పది గంటలకు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం ఉంటుందని చెప్పారు. విధి విధానాలను ఇంకా నిర్ణయించాల్సి ఉన్నదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తాము తీసుకుంటామని చెప్పారు. పార్టీ నుండి గతంలో వలె ఇద్దర్ని పిలవాలా లేక ఒక్కరిని పిలవాలా అనే అంశాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ఎందర్ని పిలవాలనే దానిపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపిస్తామని, ఎందరు రావాలో కూడా పార్టీలకు సూచిస్తామని చెప్పారు.

కాగా అఖిల పక్ష సమావేశం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అంతర్గత చర్చల్లో మునిగిపోయాయి. తెలంగాణపై ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఇటీవల పుట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు, పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్ పార్టీలు దీనిపై తర్జన భర్జన పడుతున్నాయి.

భాజపా, తెరాస, సిపిఐ తెలంగాణకు అనుకూలంగా ఉండగా సిపిఐ వ్యతిరేకిస్తోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు ఎటూ తేల్చుకోలేక పోతోంది. మజ్లిస్ రాయల తెలంగాణ అని ఓసారి తెలంగాణ అని ఓసారి సమైక్యాంధ్ర అంటోంది. ఇక అధికార కాంగ్రెసు మనసులో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా ఉంది.

English summary
Central Home Minister Sushil Kumar Shinde has announced the date of all party meeting on Thursday officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X