హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్ని ద్వేషించొద్దు: జెపి, కెటిఆర్ సంఘీభావం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: సురాజ్య ఉద్యమంకు అన్ని పార్టీల నుండి మద్దతు లభిస్తోందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ గురువారం అన్నారు. సురాజ్య ఉద్యమం పేరుతో ఆయన ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల దీక్ష చేస్తున్నారు. గురువారం రెండో రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సురాజ్య దీక్షకు అన్ని పార్టీల మద్దతు లభిస్తోందన్నారు. రాజకీయాన్ని ద్వేషించడం సరికాదని, పరిష్కారం కావాలన్నారు.

పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, కాంగ్రెసు నేత తులసి రెడ్డి, సిపిఎం, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, బిజెపి.. ఇలా అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్నారు. మంచి చదువు లేనంత కాలం రాజ్యాంగం చిత్తు కాగితమే అన్నారు. జనం చేతికి అధికారం వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. రాజకీయాలను పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపించాలన్నారు.

కులం, మతం, డబ్బు పేరిట వివక్ష లేకుండా అందరికీ ఎదిగే అవకాశాలు కల్పించేందుకు మంచి విద్యను అందించాలన్నారు. సురాజ్య లక్ష్యాలకు ఎలాంటి బేధమూ లేదన్నారు. మంచి విద్యను అందించాలని అంబేద్కర్ సైతం చెప్పారన్నారు. దీనిపై పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఇప్పటిదాకా జరిగిన ఏ ఎన్నికల్లోనైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు.

తమ బిడ్డలకు మెరుగైన భవిష్యత్తు, మంచి చదువుల కోసం ప్రతి తల్లీ తండ్రీ కోసం పోరాడాలని, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా సరే డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. సురాజ్యం కోసం అందరూ కలిసి రావాలని జెపి పిలుపునిచ్చారు.

English summary
Loksatta chief Jayaprakash Narayana said on Thusday in Surajya Deeksha that don't avoid politics but try to change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X