హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ నీలిమది ఆత్మహత్యనే, తేల్చేసిన నిపుణులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Neelima
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళా టెక్కీ నీలిమది ఆత్మహత్యేనని తేలింది. దీంతో కేసును మూసేయాలని పోలీసులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నీలిమ మృతదేహంపై ఏ విధమైన గాయాలు లేవని గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. ఆమె విషం లేదా మత్తుపానీయాలు గానీ తీసుకోలేదని తేల్చారు. హైదరాబాదులోని ఇన్పోసిస్ కార్యాలయం భవనం మీది నుంచి పడడం వల్ల అయిన గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేల్చారు.

గత జూలై 31వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఇన్పోసిస్ కార్యాలయ భవనంపై నుంచి పడి నీలిమ మరణించిన విషయం తెలిసిందే. భర్త సురేష్ రెడ్డికి మెయిల్ పంపిన కొద్ది సేపటికే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో మెయిల్‌ను విశ్లేషించిన పోలీసులు భర్త తీరుతో మనస్తాపానికి గురై నీలిమ ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం సేకరించరాు.

వారు ఎవరి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేయకపోవడం, వైద్య నివేదికలు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించడంతో కేసును మూసేయాలని పోలీసులు అనుకుంటున్నారు. మాదాపూర్ ఎసిపి అనుమతి తీసుకుని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు నివేదిక అందజేస్తామని, ఒకటి రెండు నెలల్లో కేసును మూసేసే అవకాశం ఉందని చెప్పారు.

నీలిమ మృతిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాత్రి పూట ఇన్పోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనే విషయం కూడా వివాదంగా మారింది. పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు.

English summary

 According to Gandhi hospital postmartum report - Infosys software engineer commited suici
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X