హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు చిక్కులు: వారిని వెళ్లగొట్టాలని కొత్తకోట

By Pratap
|
Google Oneindia TeluguNews

Kothakota Dayakar Reddy
హైదరాబాద్: ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా ముగ్గురు సభ్యులు గైర్హారు కావడంపై తెలుగుదేశం పార్టీలో నిప్పు రాజుకుంటోంది. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. తెలుగుదేశం పార్టీ శానససభ్యులు ఆ ముగ్గురు పార్లమెంటు సభ్యులపై గుర్రుమంటున్నారు. శానససభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి బహిరంగంగా ఆ వ్యవహారంపై గొంతు విప్పారు.

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు ఎంపిలు దేవేందర్‌గౌడ్, సుజన చౌదరి, గుండాసుధారాణి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాడ్ చేశారు. ఇలాంటి నేతల వల్ల పార్టీకి నష్టమని, చంద్రబాబునూ, పార్టీనీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చిందని ఆయన శనివారం అన్నారు.

చీము, నెత్తురు ఉంటే ఆ ముగ్గురు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తెలుగు దేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి వ్యక్తులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పి ఓటింగ్ గైర్హాజరైతే అది ఆత్మహత్యసదృశ్యమేనని ఆయన అన్నారు. ఓటింగ్‌కు హాజరుకాకపోవడానికి ఆరోగ్యం బాగోలేదనడం సరికాదని కొత్తకోట దయాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

రాజ్యసభకు ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం క్షమార్షం కాదని ఆయన అన్నారు. అది పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. కాగా, తనకు కాంగ్రెసు పార్టీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని గుండు సుధారాణి అన్నారు. తన సంజాయిషీకి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆమె అన్నారు.

English summary
TDP MLA Kothakota Dayakar Reddy has demanded three MPs to resign from the posts for absenting from Rajyasabha during voting on FDIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X