వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువరాణివారి రహస్యాలు విప్పిన నర్సు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Indian-origin nurse duped in Kate prank call is found dead
లండన్: రాజరహస్యాలను పొరపాటున బయటపెట్టిన భారత సంతతికి నర్సు బ్రిటన్‌లో ప్రాణాలు కోల్పోయింది. బ్రిటన్ కాబోయే యువరాణి కేట్ మిడిల్టన్ వేవిళ్ల వ్యవహారంలో - ఆమె ఆరోగ్య వివరాలు ఆస్ట్రేలియన్ డీజేలకు తెలియడానికి కారణమైన భారతీయ నర్సు జసింతా సల్దాన్హా(46) అనుమానాస్పద స్థితిలో మరణించింది.

కింగ్ ఎడ్వర్డ్స్-7 ఆస్పత్రికి సమీపంలో ఆమె మృతదేహం పడి ఉంది. కేట్ మిడిల్‌టన్ గర్భం దాల్చిందంటూ ఈ సోమవారం మీడియాలో వచ్చిన వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. వేవిళ్లతో బాధపడుతున్న కేట్ కింగ్ ఎడ్వర్డ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో బుధవారం ఆ ఆస్పత్రికి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తమను తాము ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ చార్లెస్‌లుగా పరిచయం చేసుకుంటూ ఇద్దరు ఆస్ట్రేలియన్ డీజేలు మెల్‌గ్రెయిగ్, మైకేల్ క్రిస్టియన్ ఆ ఫోన్‌కాల్ చేశారు.

అయితే, వారి ఆకతాయితనాన్ని గుర్తించని జసింతా వారితో మాట్లాడింది. కేట్ మిడిల్‌టన్ ఆరోగ్యం గురించి పూర్తివివరాలను వారికి వివరించింది. సల్దానా (46) ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు. సల్దానా నాలుగేళ్లకు పైగా కింగ్ ఎడ్వర్డ్ - 7 సేవలందించిందని, ఆమె అద్భుతమైన నర్సు అని, సహోద్యోగుల్లో ఆమెకు మంచి పేరు ఉందని, గౌరవం ఉందని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.

తప్పుడు పోన్ కాల్ విషయంలో తాము సల్దానాకు మద్దతుగా నిలిచామని, అపద సమయంలో తాము ఆమెకు అండగా ఉన్నామని ఆస్పత్రి మరో ప్రకటనలో వ్యాఖ్యానించింది. సల్డానా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మీడియా కూడా అభిప్రాయపడింది.

English summary
An Indian-origin nurse who was duped into transferring a hoax call that gave away information on pregnant Kate Middleton's medical condition to Australian radio presenters was on Thursday found dead in a suspected suicide. The unconscious body of Jacintha Saldanha, 46, was found this morning at an address yards away from King Edward VII Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X