వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిచ్చు: బాబుకు సుజనా రాజీనామా లేఖ, వారిపై ఒత్తిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sujana Chowdhary
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజుకుంది. రాజ్యసభకు గైర్హాజరై విమర్శల పాలైన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)పై రాజ్యసభలో ఓటింగు జరుగుతున్న సమయంలో తాను గైర్హాజరు కావడంపై ఇప్పటికే వివరణ ఇచ్చానని, క్షమాపణలు చెప్పానని అన్నారు.

తాను క్షమాపణలు చెప్పినప్పటికీ కొందరి నేతల మాట తీరు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పార్టీలో జరుగుతున్న తీరుపై తాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని చెప్పారు. తాను ఎంపి పదవికి రాజీనామా చేసినప్పటికీ తెలుగుదేశంలో యధావిధిగా కొనసాగుతానని చెప్పారు. కొందరు పార్టీ నేతల మాటలు తనను మానసికంగా బాధించాయని సుజనా చౌదరి అన్నారు. టిడిపి సిద్ధాంతాలు గౌరవించే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

కాగా రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలు ఎఫ్‌డిఐ ఓటింగు సమయంలో గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు తదితరులు ధ్వజమెత్తారు. ఇతర పలువురు నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేశారు.

మరోవైపు సుజనా చౌదరి రాజీనామా దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సుజనా రాజీనామా బాబు ఆమోదిస్తే వీరి రాజీనామా కోసం పార్టీలోని వీరి వ్యతిరేక వర్గం డిమాండ్ చేసే అవకాశముంది. బాబు రాజీనామాపై ఏం చేస్తారా అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.

English summary
TDP Rajya Sabha Member resigned for his MP post on Sunday. He was sent his resignation letter to chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X