వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమయమొస్తే దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలి: షర్మిల

వారి కుమ్మక్కు రాజకీయాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ప్రజల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జగన్‌తోనే రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం సుసాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులను పీక్కుతున్నారని, ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ఉందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఏ ఛార్జీలు పెరగలేదన్నారు. ఆయన తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసమే పని చేశారని, పేదవారు, రైతుల కోసం అహర్నిషలు తపించే వారని షర్మిల అన్నారు. ఆయన బాటలోనే జగన్ నడుస్తారని చెప్పారు.