వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నానిపై వేటేశారు మరి ఇప్పుడు: బాబుకు జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ummareddy Venkateshwarlu and Sobha Nagi Reddy
కర్నూలు: ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఓటు వేయక పోవడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెసు పార్టీతో ఉన్న చీకటి ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బయట పెట్టాలని ఆ పార్టీ ఆదివారం డిమాండ్ చేసింది. కర్నూలులో ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మాట్లాడారు. టిడిపిని చంద్రబాబు డ్రామా కంపెనీగా మార్చి వేస్తున్నారని విమర్శించారు.

లక్షలాదిమంది చిల్లర వ్యాపారస్థులను వీధిన పడేటట్లు చేసిన ఘనత చంద్రబాబుదే అని మండిపడ్డారు. రాజ్యసభలో ఓటింగుకు విప్ ఎందుకు జారీ చేయలేదో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా, పత్రికలు చంద్రబాబు గరంగరం అని పైపైకి ప్రచారం చేస్తున్నాయని, అసలు ఓటింగులో టిడిపి విధానం స్పష్టం చేయాలని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. ఓటు వేయక పోవడం ద్వారా ఎఫ్‌డిఐలకు టిడిపి అనుకూలమన్నట్లుగా ఉందన్నారు.

ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఎంపీలు ఓటింగుకు గైర్హాజరు కావడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్న చంద్రబాబు తన పార్టీ రాజ్యసభ సభ్యులను ఓటింగుకు పంపలేదని ఆరోపించారు. బాబు స్వప్రయోజనాలు కాపాడుకోవడానికే కేంద్రానికి బాసటగా నిలిచారని నిప్పులు చెరిగారు.

బాబు ఆశీస్సులతోనే తాము ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగులో పాల్గొనలేదని టిడిపి సభ్యులు కూడా స్పష్టం చేశారని, అయినా వారి నుంచి సంజాయిషీ కోరుతానని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో జగన్‌ని జైలులో కల్సిన వెంటనే గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని, విజయవాడలో మర్యాదపూర్వకంగా కల్సిన వల్లభనేని వంశీని ప్రశ్నించిన బాబు వారిని సస్పెండ్ చేయకుండా సంజాయిషీ కోరతాననడం విడ్డూరంగా ఉందన్నారు.

English summary
YSR Congress party leaders Ummareddy Venkateshwarlu and Sobha Nagi Reddy were questioned TDP chief Nara Chandrababu Naidu about MPs absence to Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X