హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు బుట్టలో పడ్డారు: ఎంపీల డుమ్మాపై జగన్ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్/ కర్నూలు: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐల) అనుమతిపై రాజ్యసభలో ఓటింగు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసి పార్లమెంటు సభ్యుల మీదికి నెడుతున్నారని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు డిఎ సోమయాజులు ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేసి ఎంపిలపైకి నెట్టడం సమంజసం కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఎఫ్‌డిఐలపై చంద్రబాబు వైఖరి ఎవరికీ అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఎఫ్‌డిఐల వల్ల చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్‌లోకి చంద్రబాబు నేరుగా ఎఫ్‌డిఐలను అనుమతించాలని ఆయన అన్నారు. అందరినీ మోసం చేయాలనే చంద్రబాబు బుట్టలో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. సొంత వ్యాపారాల పరంగా చంద్రబాబు ఎఫ్‌డిఐలను సమర్థిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ విషయాన్ని చంద్రబాబు బహిరంగంగా ప్రకటిస్తే సమస్య లేదని అన్నారు.

వ్యక్తిగతంగా ఎఫ్‌డిఐలను సమర్థిస్తూ పార్టీపరంగా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, అది ఎంత వరకు సాధ్యమని ఆయన సోమయాజులు అన్నారు. రుణాల మాఫీపై చంద్రబాబు విధాన నిర్ణయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండడానికి వీలు లేదని ఆయన సోమవారం కర్నూలులో అన్నారు. తెలుగుదేశం పార్టీని కాంగ్రెసుకు చంద్రబాబు తాకట్టు పెట్టారని, కాంగ్రెసుకు తొత్తుగా మారారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఎఫ్‌డిఐలపై ఓటింగుతో తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసేది రాజకీయం అయితే చంద్రబాబు చేసేది ఏమిటని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.

English summary
YS Jagan's YSR Congress party leader Somayajulu launched scathing attack on Telugudesam party president N Chandrababu Naidu in FDIs issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X